విశాఖలో చంద్రబాబు సడన్‌గా ధర్నాకు దిగారు. విమానాశ్రయంలో బైఠాయించారు. చంద్రబాబు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళనలు చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. దీంతో పోలీసులు చంద్రబాబును వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. అయితే, చంద్రబాబు రోడ్డు మీద బైఠాయించారు.