అమరావతిలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నాని.. రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బుధవారం మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడిని.. ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. వైసీపీ హింసకు పాల్పడుతోందని.. ఏపీలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచిఉందని చెప్పారు టీడీపీ అధినేత. స్థానిక సంస్థల్లో పోటీచేస్తున్న ప్రతిపక్ష అభ్యర్థులను భయపెట్టి, దాడులు చేస్తున్నారని.. కొన్నిచోట్ల నామినేషన్ పత్రాలను చింపేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీకీ వైసీపీ నేతలు ఎందుకు అడ్డం పడుతున్నారు. అబద్ధాలు చెప్పడం కాదు ప్రజాస్వామ్య విలువలు నేర్చుకోండి. మాచర్లకు మా నేతలు మూడు కార్లలో వెళ్లారు. 10 కార్లు వెళ్లాయని అబద్ధాలు చెబుతున్నారు. మీ మాటలను ప్రజలు నమ్మరు. మీకు ఎవరూ భయపడరు. రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురిచేస్తారా? ఆంబోతుల మాదిరి రోడ్ల మీద పడి ఇష్టానుసారంచేస్తే మేం భయపడాలా? ఏం ఆటలాడుతున్నారా..? మీ ఆటలు ఇక సాగవు. ప్రజలు పిచ్చి కుక్కలను కొట్టినట్లు కొడతారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.