ప్రధాని నరేంద్ర మోదీ మీద కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శంషాబాద్లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ నిమిషం ప్రజల మీద ఎలాంటి బాంబు పేలుస్తారో తెలియదని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ సమక్షంలోనే విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.