కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిటీ లైట్ హోటల్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ghmc పారిశుధ్య సిబ్బందికి రిఫ్రెష్ మెంట్ లు పంపిణీ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు నగర్ లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి ఆధ్వర్యంలో పండ్లు, బిస్కెట్స్, గుడ్లు, వాటర్ బాటిల్ పంపిణీ చేసారు.