HOME » VIDEOS » National

Video : ఆర్టీసీ కార్మికులకు మంత్రి హరీశ్ రావు బియ్యం పంపిణీ..

National రాజకీయం18:18 PM December 16, 2019

ఆర్టీసీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. పటాన్‌చెరులోని ఆర్టీసీ కార్మికులకు మంత్రి హరీశ్ రావు బియ్యం పంపిణీ చేశారు. కార్మికులు సమ్మె చేసిన కాలానికి జీతం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఆర్టీసీ మనందరి సంస్థ అని... దీనిని బలోపేతం చేసుకోవాలని సూచించారు. సంస్థలో ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవాలని అన్నారు. ఆర్టీసీలో టికెట్ ధర పెంచుకున్నామని... హైదరాబాద్‌లోనే 54 లక్షల ఆదాయం పెరిగిందని హరీశ్ రావు అన్నారు. అక్రమం వాహనాలను ప్రభుత్వం నియంత్రిస్తుందని అన్నారు.

webtech_news18

Top Stories