ఉన్న వనరులతో విశాఖ నగరం పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని తరలింపు పేరుతో తెదేపా నేతలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘అసెంబ్లీ, సచివాలయం మాత్రమే ఉంటే రాజధాని అభివృద్ధి చెందదని చంద్రబాబు గతంలో చెప్పారు. ఐటీ అభివృద్ధితో పాటు కనెక్టివిటీ, యాక్టివిటీ పెరగాలని అప్పుడు ఆయన అన్నారు. రాజధాని రైతులను ఇంకా మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అతని మాయలో పడొద్దని రైతులను కోరుతున్నాఅని బొత్స వివరించారు.