ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ వ్యభిచారి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం నడిపిస్తోందన్నారు. నిజామాబాద్లో ఎంపీ ఆర్వింద్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్కు అసదుద్దీన్ ఓవైసీ పెద్ద కొడుకులా మారారని ఎద్దేవా చేశారు. పూర్వీకుల గురించి బయట పడుతుందనే ఎన్ఆర్సీని ఓవైసీ వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. సీఏఏ, ఎన్ఆర్సీలపై కేంద్రం వెనక్కి తగ్గేది లేదని, కరాఖండిగా అమలు జరుగుతుందని స్పష్టం చేశారు.