మంగళగిరి ఎమ్మార్వో కార్యాలయం వీఆర్వోపై అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చినకాకాని విఆర్వో లంచం తీసుకున్న వీడియోను బహిర్గతం చేశారు బాధితులు.వీడియో ఆధారంగా విచారణకు ఆదేశించారు మంగళగిరి ఎమ్మార్వో. పట్టాదారు పుస్తకం మంజూరులో వీఆర్వో ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిన్న ఆఫీసులో పెట్రోల్ తో రైతు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు.