నిజామాబాద్ జిల్లాలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్న నిర్వహంచారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ చట్టం సవరణకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట ఆందోళణకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చెసారు. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మొండిగా, నిరంకుశ వైఖరితో ముందుకు పోతుందని ఇది సరైంది కాదన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశంలో ఐక్యతను విచ్చిన్నం చేసి మెజార్టీ ప్రజల మన్ననలు పొందాలని బిజెపి ప్రయత్నిస్తుందని ఈ వైఖరిని విడనాడి దేశ పౌరుల మధ్య వైషమ్యాలను తగ్గించటానికి పౌరసత్వ చట్టం సవరణ (క్యాబ్) ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.