నగరంలో నవంబర్ 28 న జరిగే హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి పాల్గొనాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.టి.రామారావు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఆహ్వానించారు.
ఈ సమావేశంలో కేటీఆర్.. మిషన్ భాగీరత, డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్, అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఓడిఎఫ్ హోదా, అధునాతన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు మొదలైన వాటి గురించి వివరించారు.