ఈనెల 14న చంద్రబాబునాయుడు చేపట్టిన ఇసుక దీక్షకు మద్దతుపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ప్రజాసమస్యల పట్ల ఎవరు స్పందించినా వారికి సంఘీభావం తెలుపుతామని, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే వైఖరితో వ్యవహరించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.