టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బుధవారం ఉదయం మినిస్టర్ క్వార్టర్స్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. కవితతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, బాజీరెడ్డి గోవర్థన్ తదితరులు స్పీకర్‌ను కలిశారు. పోచారంను కలిసిన అనంతరం కవిత అక్కడ నుంచి నేరుగా నిజామాబాద్ బయల్దేరారు.