నల్లమల కోసం తాను చివరి శ్వాస వరకు పోరాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. పాదయాత్రల దగ్గర నుంచి ప్రాణత్యాగం వరకు తాను సిద్ధమేనని వెల్లడించారు. తన వంతుగా సైనికుడిలా కృషి చేస్తానని, పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తానని స్పష్టం చేశారు.