జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాలల్లో పర్యటిస్తూ, అక్కడి రైతులతో మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ఎర్రబాలెం రైతులతో సమావేశమైన పవన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటానని భరోసానిచ్చారు.