జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా తమ్మిరెడ్డి శివశంకర్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. గ్రూప్ 1 ఆఫీసర్ అయిన శివశంకర్ 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. తోట చంద్రశేఖర్ తర్వాత మరో ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ కొనసాగనున్నారు.