గతకొన్ని నెలల హైడ్రామాకు తెరదించుతూ 2012నాటి నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులను తీహార్ జైల్లో ఉరితీశారు. ఇవాళ ఉదయం 5.30 గం.లకు నలుగురు రేపిస్టులకు ఉరిశిక్షను అమలు చేశారు. దీనిపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ నిర్భయకు న్యాయం జరగడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఇలాంటి సంఘటన మరలా జరగదని మేము ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇప్పటి వరకు దోషులు చట్టాన్ని ఎలా మార్చారో మనము చూశాము. మన వ్యవస్థలో చాలా లొసుగులు ఉన్నాయి, మేము వ్యవస్థను మెరుగుపరచాలి అని అన్నారు.