భారతదేశ తొలి ఓటర్ 102 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి... తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికి జరిగిన 16 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న శ్యామ్ శరణ్ నేగి... 17వ సారి లోక్‌సభ ఎన్నికల్లో ఓటేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లా కల్ఫా గ్రామానికి చెందిన శ్యామ్ శరణ్ నేగి... 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో ఓటేసిన ప్రాథమిక పాఠశాలలోనే ఇప్పుడూ ఓటేశారు. శ్యామ్ శరణ్ నేగి కోసం అధికారులు రెడ్ కార్పెట్ వేసి, మేళతాళాల మధ్య స్వాగతం పలకడం విశేషం.