మెదక్ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పట్టణంలోని అజాంపురా కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈయన ఢిల్లీ లో తబ్లిక్ జమాత్ కార్యక్రమానికి హాజరై గత 15 రోజుల క్రితం మెదక్ కు తిరిగి వచ్చిన వ్యక్తిగా గుర్తించారు. గాంధీ హాస్పిటల్ లో పరీక్షల అనంతరం సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్ గా వెల్లడించారు.