ప్రధాని మోదీ ఇలాఖా వారణాసిలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్కి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రోడ్ షోలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.