రాష్ట్రంలో పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ రంగులను చెరిపిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కోరారు. హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నందున ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కూడా అమలు చేయాలని కోరారు. గ్రామ వాలంటీర్లకు ఎన్నికల విధులు ఇవ్వకూడదని తాము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు.