ఢిల్లీలో జరిగిన హింసాకాండకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని హైదరాబాద్ లో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హిమాయత్‌నగర్‌లో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ ర్యాలీలో అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సీపీఐ నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి నారాయణగూడ పీఎస్‌కు తరలించారు.