HOME » VIDEOS » National

Video : ఆ ఇద్దరికీ కరోనా లేదు.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి ఈటల

తెలంగాణ19:43 PM March 05, 2020

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓ తీపికబురు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఇద్దరికి సంబంధించి కరోనా టెస్ట్ రిపోర్టులు వచ్చాయని, వారిద్దరికీ ఎలాంటి కరోనా లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకిందనే అనుమానంతో ఆ కంపెనీ మొత్తం ఖాళీ చేసి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కల్పిచారు. అయితే, ఆమెకు కరోనా లేదని రిపోర్టుల్లో తేలింది. ఇక అపోలో ఆస్పత్రిలో శానిటేషన్ పనిచేసే మహిళకు కూడా కరోనా లేదని రిపోర్టులో వచ్చినట్టు ఈటల రాజేందర్ తెలియజేశారు. ఇప్పటి వరకు కేవలం తెలంగాణలో ఒకరికి మాత్రమే కరోనా ఉందని, అతడి ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతోందని, రెండు మూడు రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఈటల రాజేందర్ తెలిపారు. మరోవైపు నిన్న టెస్టులు చేసిన వారిలో 21 మందికి కరోనా నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని ఈటల మీడియాకు తెలిపారు. ఈ రోజు మరో పది మందికి టెస్టులు నిర్వహించామన్నారు.

webtech_news18

Top Stories