సార్వత్రిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రూపంలో కొత్త చిక్కు వచ్చిపడింది. ఆయన ప్రధాని మంత్రి కావడానికి దారితీసిన పరిస్థితులపై బాలీవుడ్లో తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ మూవీ కాంగ్రెస్ పార్టీలోనే కాదు..దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు విడుదలకు ముందే ఈ మూవీపై వివాదాలు ముసురు కుంటున్నాయి.