రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం వయనాడ్ (కేరళ)లో పర్యటిస్తున్నారు. వయనాడ్లో దిగిన తర్వాత పీసీసీ కార్యాలయానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఓ రెస్టారెంట్ వద్ద ఆగారు. అక్కడ టిఫిన్ చేసి టీ తాగారు. అనంతరం స్థానికులతో ముచ్చటించారు. రాహుల్ రెస్టారెంట్లో ఉన్నారన్న విషయం తెలిసి.. ఆయన చేసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.