ఇంటర్ బోర్డ్ వద్ద అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులకు పాల్పడ్డారు పోలీసులు. అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్. కేటీఆర్‌కు ఏ మాత్రం బాధ్యత ఉన్నా... ఇంటర్ బోర్డు వద్దకు వచ్చి అరెస్ట్ అవ్వాలని డిమాండ్ చేశారు.