ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) పనితీరుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశించిన రీతిలో ఏసీబీ పనితీరు కనిపించడం లేదని అన్నారు. ఏసీబీలో అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలకంగా అంకితభావంతో పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. ఏసీబీలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదని సూచించారు. అవినీతి నిరోధానికి 14400 కాల్‌సెంటర్ ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. కాల్ సెంటర్ ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. ప్రజలెవ్వరూ కూడా అవినీతి బారిన పడకూడదని అన్నారు.