తమ ప్రభుత్వం ఎన్నాఆర్సీకి పూర్తిగా వ్యతిరేకమన్నారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న జగన్... ఎన్ఆర్సీపై స్పందించారు. ఎన్ఆర్సీకి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వదన్నారు. మైనార్టీలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు జగన్. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజలు CAA, NRCకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు సైతం కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకంగా గళమెత్తింది. ఇటు తమిళనాడు, కర్నాటకలో సైతం ప్రజలు పెద్త ఎత్తున ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నారు.