Federal Front: ఫెడరల్ ఫ్రంట్ కోసం డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలిసేందుకు తమిళనాడు వెళ్లిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ రోజు ఉదయం శ్రీరంగంలో పర్యటించారు. అక్కడి రంగనాథస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి ఆశీర్వచనం, తీర్థం అందజేశారు.