టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. సిట్టింగ్ ఎంపీ కే. కేశవరావుతో పాటు కేసీఆర్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌గా పని చేసిన కేఆర్ సురేశ్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. రేపు ఉదయం 11 గంటలు ఈ ఇద్దరు నేతలు రాజ్యసభకు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావుకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్... రెండో అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు చేసిన చివరకు సురేశ్ రెడ్డికి అవకాశం కల్పించారు.