ముంబైలో హునర్ హాట్ ఫెస్టివల్ ప్రారంభించారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మైనార్టీ డిపార్ట్ ఆధ్వర్యంలో మైనార్టీ శాఖ మంత్రి ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. చేతి వృత్తుల ఆధారంగా బతుకుతున్న మైనార్టీ వర్గాల ప్రజలకు చేయూతనిచ్చేలా చేనేత ప్రదర్శనను చేపట్టామన్నారు. చేతి వృత్తులు కనుమరుగవ్వకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.