ఇంజినీరింగ్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై తిరుపతిలో ఆందోళనకు దిగారు సినీనటుడు మోహన్ బాబు. ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ... శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆయన వెంట కుమారులు మంచు విష్టు, మంచు మనోజ్ కూడా ఉన్నారు. విద్యార్థులు కూడా భారీ ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.