ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా వైసీపీ గూటికి చేరారు. చేరికల కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వల్లభనేని వంశీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరాం కూడా సీఎం జగన్ను కలిశారు. ఐతే ఆయన మాత్రం వైసీపీలో చేరలేదు. వల్లభనేని వంశీ తరహాలో బయటి నుంచే వైసీపీ ప్రభుత్వానికి కరణం బలరాం మద్దతు ప్రకటించనున్నారు.