వైఎస్ వివేకానందరెడ్డి హత్యను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్. సాక్షాత్తూ ఓ ముఖ్యమంత్రి సోదరుడు దారుణ హత్యకు గురయ్యాడంటే రాష్ట్రంలో లా&ఆర్డర్ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు నాయుడి పాలనలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వర్గం రాష్ట్రాన్ని దోచేసుకున్నారని ఆరోపించారు.
లక్ష మంది పోలీసులతో తమను అడ్డుకోవాలని చూసినా సరే.. 30 వేల మెజారిటీతో తాను చీరాలలో తానే మళ్లీ గెలుస్తానని ఆమంచి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ డిపాజిట్లు గల్లంతుకానున్నాయని.. చీరాలలో టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని అన్నారు. దోచుకున్న డబ్బును దొంగ అకౌంట్లలో దాచుకున్న చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. గతంలో నడిరోడ్డుపై ఉండే కారంచేడు ఉద్యమాన్ని నడిపించామని.. ఇప్పుడు రాష్ట్రమంతా నీ వైఫల్యాలను ఎత్తిచూపుతామని అన్నారు.