అమరావతి ఓ మహానగరంలో అవుతుందని భావించానన్నారు. అమరావతి చరిత్రలో నిలిచిపోతుందని అనుకున్నానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు నిస్వార్థంగా 33వేల ఎకరాలు ఇచ్చారన్నారు. రైతులకు న్యాయం చేయడానికే ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ ప్రకటించామన్నారు. ఆనాడు వ్యక్తిగతంగా కాకుండా ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చానని గుర్తు చేశారు. కానీ తన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారం చేయడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమన్నారు.