ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యక్తిగత మినహాయింపు పిటిషన్ను ప్రత్యేక సీబీఐ కోర్టు కొట్టివేయడంతో టీడీపీ నేతలు వైసీపీ అధినేతపై విమర్శలు చేశారు. అయితే, బాబ్లీ కేసులో చంద్రబాబు కూడా సీఎంగా ఉన్నాను కాబట్టి మినహాయింపు ఇవ్వాలని కోరారని మంత్రి పేర్నీ నాని గుర్తు చేశారు.