ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికను సీఎం జగన్కు అందజేసింది ఆ సంస్థ. ఈ రోజు మధ్యాహ్నం 3.30కి సీఎం జగన్తో BCG ప్రతినిధులు భేటీ అయ్యి, నివేదికను అందజేశారు. నివేదికలో పంటపొలాలు ఉన్న ప్రాంతంలోకంటే ఇప్పటికే భవనాలు ఉన్న ప్రదేశంలో రాజధానిని నిర్మించడం మేలని ఆ నివేదిక సూచించింది.