జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ మతం, ధర్మం గురించి కనీసల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఖబడ్దార్ పవన్ అని హెచ్చరిస్తూ ట్విట్టర్లో వీడియో పోస్టు చేశారు.