యాదాద్రిలో పునర్ నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం శిలలపై కేసీఆర్, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు, టీఆర్ఎస్ పథకాల గుర్తులు చెక్కినట్లుగా వస్తున్న వార్తలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.