వాట్సప్ గ్రూప్స్‌లో తనపై అసభ్య కామెంట్స్ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ వర్గాలపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రౌడీయిజం, గూండాయిజం అంటూ మహిళా అభ్యర్థిని అవమానిస్తారా అని మండిపడ్డారు. తాను ఎవ్వరికీ భయపడే వ్యక్తిని కానని..ప్రజల్లో తనకు ఆదరాభిమానాలు ఉన్నాయని స్పష్టంచేశారు. షాద్‌నగర్ పరిధిలోని ఫరూఖ్‌నగర్‌లో పోలింగ్ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఐతే తనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ టీఆర్ఎస్ వర్గంపై మండిపడ్డారు డీకే అరుణ.