ఇటీవలే బీజేపీలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నిడియోల్ ఎన్నికల బరిలోకి దిగారు. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఎన్నికలు ముగియడంతో ఆయన అక్కడ్నుంచి తన సామాగ్రి తరలించేశారు. ముఖ్యంగా జిమ్‌కు సంబంధించిన పరికరాలన్నింటిని సనీ డియోల్ ప్రత్యేక వాహనంలో గురుదాస్ పూర్ నుంచి తరలించారు.