కెండాల్ జెన్నర్.. అమెరికాలో టాప్ మోడల్. 19 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన కెండాల్ ఏటా రూ.143 కోట్లు సంపాదిస్తోంది. ఎన్నో ప్రముఖ కంపెనీలకు మోడల్‌గా వ్యవహరిస్తోన్న కెండాల్ తన సోదరి కైలీ జెన్నర్‌తో కలిసి ‘కెండాల్-కైలీ క్లోథింగ్ లైన్’ బ్రాండ్ పేరుతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. కెండాల్ సోదరి కిమ్ కర్దాషియన్ కూడా ప్రముఖ మోడల్ అయిన సంగతి తెలిసిందే.