జస్టిస్ ఎస్ఏ బోబ్డే అందుబాటులో లేని కారణంగా ఈ నెల 29న అయోధ్య రామ మందిరం కేసు విచారణను సుప్రీం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిరం కేసును ఎటువంటి వాయిదా లేకుండా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 70ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని అన్నారు.