భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తెచ్చారని విమర్శించారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈ చట్టంతో దేశంలోని హిందువులు, ముస్లింలను విభజించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమన్నారు. మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచన.. అంబేడ్కర్, నెహ్రూ, గాంధీ, బాబూ రాజేంద్రప్రసాద్‌లలో ఏ ఒక్కరికీ రాలేదని, ఈ గొప్ప ప్రధాని మోదీకే వచ్చిందని ఎద్దేవా చేశారు.