HOME » VIDEOS » National

Video : ఏపీలో మూడు రాజధానులు.. జగన్ సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్19:58 PM December 17, 2019

ఏపీ రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందా..? మరో చోటుకు మారుస్తారా..? అన్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. ముందు నుంచి చాలామంది భావిస్తున్నట్టే.. ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ అవసరం ఉందని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. ఏపీలో సౌతాఫ్రికా మోడల్ తరహాలో 3 రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చెప్పారు. అమరావతిలో చట్టసభలు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చని అన్నారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుందని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విశాఖపట్నంలో ఇప్పటికే అన్ని వసతులు ఉన్నాయని, ఒక మెట్రో రైలు వేసుకుంటే సరిపోతుందని అన్నారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.

webtech_news18

Top Stories