ఈనెల 19న కర్నూలులో వైసీపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుందన్నారు మంత్రి అనిల్ కుమార్. ఈ సభకు సీఎం జగన్ కూడా హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా కర్నూలులో పలువురు మంత్రులు పర్యటించారు. మంత్రి బుగ్గన, మంత్రి అనిల్ కుమార్ సభా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలంతా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలన్నారు.