రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎస్సీ, ఎస్టీల కోసం వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎస్సీల కోసమే ప్రత్యేకంగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీలను విభజించి పాలించాలని చంద్రబాబు ప్రయత్నించారని, కానీ, తాము మాత్రం అందరినీ ఒక్కటి చేశామన్నారు.