కువైట్లో చిక్కుకున్న పశ్చిమ గోదావరి జిల్లా మహిళల ధీనావస్థపై ఏపీ సీఎం కార్యాలయం స్పందించింది. తమను కాపాడాలంటూ సోషల్ మీడియాలో ఆ మహిళలు పెట్టిన వీడియో సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ రంగంలోకి దిగి కువైట్లోని భారత ఎంబసీని సంప్రదించారు. వారిని వీలైనంత త్వరలో ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.