ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి బుధవారం ఉదయం సమావేశమైంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్ బ్యాగులు ఇవ్వాలని కేబినెట్ భేటీలో ప్రతిపాదించారు. మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు.