కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే అంశంలో జిల్లాల స్థాయిలో టాస్క్ఫోర్సులు పనిచేస్తున్నాయా? లేదా? అని ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. మంత్రులు సమీక్షలు చేస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు. అలాగే నియోజకవర్గాల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లు ఎలా పని చేస్తున్నాయో ఆరా తీశారు. కోవిడ్ –19 నివారణా చర్యలపై ఇవి చురుగ్గా పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో కోవిడ్–19 విస్తరణ, కొత్తగా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎం జగన్‌కు అందించారు. కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని వివరించారు. వీరిలో చాలా మంది ఢిల్లీలో ల్లో నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యులేనని వెల్లడించారు. వీరిపై ప్రధానంగా దృష్టిసారించి ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్‌కు చెప్పారు.