ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసగించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రోజు నుంచే పథకం అమలవుతుందన్నారు. ‘వైఎస్సార్ వాహన మిత్ర’ కు ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి అక్టోబర్ 30 వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.